//మనోహరుడివే//
కన్నులకు కానుకయ్యావా..
కాటుక కలలకు రంగులవన్నెలద్ది..!!
పాపిట తిలకమయ్యావా..
పగలూ రేయిని ఒక్కటిగచేసి ..!!
మెరిసే ముక్కెరయ్యావా..
సరసపు పుప్పొడిని ముక్కుకద్ది..!!
వలచే సిగ్గువయ్యావా..
పచ్చని చెక్కిట ఎర్రనిదుమారమే రేపి ..!!
పెదవంచున విరుపువయ్యావా..
అరనవ్వుల మెరుపుగా మారి..!!
మెడఒంపున గిలిగింతవయ్యావా.
.ముత్యాలసరాల గొలుసును చేరి..!!
నువ్వేగా నాకన్నీ..
నా మనసురుచి తెలిసిన ఏకైక మదనుడివని ..!!
No comments:
Post a Comment