Sunday, 28 March 2021

// సెగలు //

 జ్వలిస్తుంది మనసు

చూసీ చూడక వదిలేసిన గ్రీష్మం
దేహాన్ని తాకి మంటై ఎగుస్తున్నట్టు..
బరువైన క్షణాలకి
సొంతవాక్యం రాసే దిగులు
ముద్దులు హద్దయిపోయినప్పటి సెగలు
కోల్పోయిన నవ్వులకి
నెత్తుటి మరకలు పూసిందెవరో
మిగిలిన రంగులన్నీ వెలిసిపోయినట్టు..
మత్తెక్కించే పాటలన్నీ
ప్రణయాగ్ని కీలలై చుట్టుముట్టే వేళ
భావాల భాషంతా గుండెల్లో ఘోష
మధురమైన మాటలకు రెక్కలొచ్చి
ఎటో ఎగిరిపోయిన దారిలో
నిశ్శబ్దపు ఊరేగింపు చెల్లాచెదురైనట్టు
ఉదయాస్తమానాల నా ఊహలు..
కొండెక్కే వరకూ ఆగాల్సిందే
కొన్ని గాయాలు కన్నీళ్ళతో కడగలేమంతే 😥

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *