Sunday, 28 March 2021

// Floating Life.. //

 ఎవరన్నారు ప్రకృతి సోమరిగా ఉంటుందని

అలుపెరిగని పద్యంలా పరుగెత్తుతూ పోతుందది

సూర్యుడు ఒక్కపూట సెలవు తీసుకుంటే
ఆహ్లాదం గానీ.. నిత్యం బద్దకిస్తే చీకటది

ఋతువులు కదిలి రోజులు మారుతుంటే
ఉత్సాహం గానీ.. ఒకేలాగుంటే నీరవమది

ఎప్పుడూ పనీపాటల్లో మునిగి
అప్పుడప్పుడూ చిలిపిగెంతులేస్తే కదా జీవితం

స్మృతులకి సాగిలపడి గ్రీష్మాన్నే వగచేవారికి
వర్షంలో తడిచినా స్వేదమనేదొక్కటే భావన

ప్రవాహాన్ని తోచీతోచక ఉరకలేస్తుందనుకుంటే
మన వంట్లో రక్తం కూడా ఒకేచోట నిలిచిపోగలదు

విజయాన్ని వెంటబెట్టుకు తిరిగేవారికి మేఘాలూ దారిస్తాయి
నక్షత్రమాల వరించేందుకు ఆకాశానికంతా ఎగిరొచ్చాడనీ..😍

ఏమో..
మనసుకిటికీ తెరిచి
జ్ఞాపకాల ఊరేగింపులో వెనుకబడేవాడు
నిదురని మరచి పగటికలని మాత్రమే ప్రేమించగలడు

P.S., ఈ ప్రపంచంలో అందరికన్నా బద్దకస్తుడు..
"గర్భిణీ స్ర్రీ"ని పెళ్ళి చేసుకునేవాడు - Yandamoori Veerendranath 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *