రాధికా స్వసాంత్వనం
మనసున మల్లెలు పరిమళించిన వేళలో ...అక్షర సుమమాలలు
Monday, 8 July 2024
హేమంతంలో వసంతం... 😌
హేమంతపు తెమ్మెర చలిగా అరుస్తూ
నీ మౌనాన్ని అనువదిస్తుందేమో..
ఆకాశపుటంచుల వెంబడి ఆ వచనం
ఆహ్లాదపు ప్రేమలేఖగా
నాలో నిండిన భావోద్వేగం..
ప్రదోష ప్రాణాయామంలో పీల్చుకున్న శ్వాస
నీ జ్ఞాపకమే అయినట్టు
ఎద తోటకి ఇప్పుడు వసంతఋతువేమో..
వెన్నెల్లో గోవర్ధనం గుండెల్లోకొచ్చి
గోరువెచ్చనైన కలలు పొదిగినట్టు
ఈ వేకువ వాత్స్యాయన సుప్రభాతం...
అక్కడా ఇక్కడాని సౌందర్యాన్ని, సంతోషాన్ని
నేనేం వెతకలేదులే..
నీలో కాంతివేగానికి నాలో శీతలత్వం కరిగి
చిగురిస్తున్నానని చెప్తున్నా అంతే !!
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
పదేపదే జారుతున్న ఊహల్లో అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు నిన్నటివే జ్ఞాపకాలు.. కన్నీటితో సమంగా కాలం కరుగుతున్నా అలుపులేని అవస్థలో...
-
అవును.. మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా అది సంధ్య ముస...
-
ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో ఓ మనసు పాట ఇప్పటికీ అదే ఆర్తితో వినాలనిపించే మధువొలుకు పాట అయితే వెన్నెలొలుకు రాతిరిలో విషాదాన...
-
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు నల్లనిమబ్బులమయమైన ఆకాశం మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది ఒంటరిగా యాతన పడుత...
-
చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు నీ తడికన్నుల్లో నీరై జారిపో...
