అవును..
మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు
ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు
బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా
అది సంధ్య ముసురుకున్న చీకట్లోకి మారుతుందని
సరిపెట్టుకోక తప్పలేదు..
రాతిరి కోసం ఆరాటపడ్డంతసేపు పట్టలేదు
మరో వేకువయ్యింది కానీ
నీ జాడైతే లేదు..
మళ్ళీ అదే ఉషోదయం..
అందులోనూ హేమంతం
నాకు వెచ్చదనం అందుతుందనే నమ్మకమైతే లేదు
ఇప్పటికింతేనేమో..
నువ్వక్కడ..నేనిక్కడ..

No comments:
Post a Comment