ఈ వేళలో నీవు..ఏం చేస్తూ ఉంటావో
మనసుని పాట కడితే ఇలానే ఉంటుందేమో
క్షణక్షణం గుచ్చే నీ చూపులూ నవ్వులు
ఊహలతో విలవిలలాడుతున్నానంటే నమ్మవుగా..
తూరుపుకన్నా ముందే విరిసే నా మోమునడుగు..
నువ్వు తప్ప వేరే థ్యాస నాకు తెలుసేమోనని
ఆత్మ ఆలపించే ఆశామధురిమను ఆలకించు
రంగురంగుల గుసగుసలు..వాలేపొద్దుల సరిగమలూ
రెప్పలచాటు చిరుకలలూ..పూచేపెదవుల పల్లవులూ
ఎక్కడ మీటుతావో తాకి చూస్తేగా..
ఎప్పుడు కలిసావో తెలియదు కానీ..
గుండెల్లో వెన్నెల కుమ్మరించావు..
వేయి స్వరాలొక్కటై పిలిచినట్లు మత్తకోకిలను మరిపించావు
అందుకే జీవఖైదీనవుతుంటా నీ అనుభూతుల్లో
పురులిప్పుకుంటుంటా నా సంతోషపు వృత్తంలో..

No comments:
Post a Comment