ఇప్పుడిక తెల్లవారితేనేముంది
నేనిప్పటిదాకా చూస్తుంది చీకటినేనని తెలిసాక
మనసుండీ ఏం యోగం
నీ చూపుకో ఆటబొమ్మగా నే మిగిలాక
ఇది నీకు దగ్గరవాలని ప్రయత్నించిన ప్రతిసారీ నేనోడిపోతున్న ఆటేగా
నీకెందుకంత ఇష్టమో..
ఎవరికీ వినబడని మనోగీతిక నీదైనందుకా
లాలితాన్ని పెకిలించి ఆనందించే విలాసం
ఓనాటికి మిగిలిపోదువులే ఒంటిగా
నేనస్తమించే రోజుకై వేచి చూడు మరి..!!
No comments:
Post a Comment