Friday, 17 November 2017

//అనుకున్నా..//


ముసురేసినప్పుడే అనుకున్నా..
ఈరోజు ఖచ్ఛితంగా వాన కురవదని..
కలలవైపు..కవిత్వంవైపు
దారి మళ్ళించి
తను ఎంచక్కా
కదిలే మేఘాల్లో తేలిపోతూ
నా భావుకతను
దొంగతనంగా
తొంగిచూస్తుందని..:D  


No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *