నీ మోము..
వర్ణించడం ఎవరికవసరమని..
కానీ నాకు మాత్రం ఓ అమూల్యబింబం.
చదివితే ఓ ప్రేమ పుస్తకం
నే రాస్తే రసరమ్య కావ్యం.
కొసరి కొసరి నవ్వే నీ కళ్ళు..
చూపులతో ఆలింగనం చేసే చొరవున్న కళ్ళు..నిమీలితమవడం నాకిష్టం.
చిలిపిదనం హద్దు దాటనీయక..
నాకోసం ముద్దులు దాచుకున్న నీ పెదవులు..ఇంకెవరికీ ఉండవిది సత్యం
సున్నితమైన భావాల హృదయం..
నీకుందని ఒప్పుకోకనే..కొదమసింహమల్లె ఆ గర్వం..ఓ విస్మయం
నీ మోమంటేనే అదో మనసైన చిత్రం.
నన్ను చిత్తరువును చేసే ఆ రూపం అపురూపం
అందుకే రుబాయిలు చేసి పాడుకుంటుంటా నా ఆహ్లాదం..
అన్నీ కలగలిసిన నీ వదనం..అదో అపరిమిత ఆనందపు స్వర్గం..

No comments:
Post a Comment