Friday, 17 November 2017

//ఆవాహనం..//




నా మనసిక్కడ లేదిప్పుడు..ఒక గాఢాలింగనంలో నిన్ను పొదుపుకున్న ఊహలో
కాలాన్ని కాసేపు ఆగమని బ్రతిమాలినట్టు
నువ్వో తీగలా సాగి..నీలో వెచ్చదనాన్ని దిగమింగుకుంటూ
నా ఒడినాశ్రయించి
మగత కమ్మిన దేహాన్ని నాకప్పగించి నిదురించినట్టు
ఈ రాత్రి నాకెంతో విలువైనది.
నీలో కుదురుకున్న కల్లోలాన్ని తప్పించి
ఆగమ్యంగా తిరుగుతున్న నీ మనసుకో ఆకృతినిచ్చి
ఇన్నాళ్ళ నా తపస్సును నీకు ధారపోసేందుకు
నీలో కదులుతున్న చిత్త చాంచల్యాన్ని
నా వేలికొసలతో దూరం చేసేందుకు..!!

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *