విముక్తి కావాలంటూ..
జ్ఞాపకాల్ని కిటికీలోంచీ విసిరేస్తావ్ గానీ..
నువు రోజూ మాట్లాడే గులాబీ నన్ను తప్పక గుర్తుచేస్తుంది..
అనురాగమంటే అయిష్టమంటూ నువ్వు వినే రసరాగం..
నా స్వరాన్నే వినిపిస్తుంది..
నీ వర్తమానం..నా ఊహాలోకం..
మరెవరికీ ప్రవేశం లేని స్వర్గద్వారం..
చిక్కగా గొంతులో దిగుతున్న కాఫీలో కమ్మదనం
నీకు తెలీకుండానే నీలో వెచ్చదనాన్ని పుట్టిస్తుంది
ప్రేమను రద్దు చేయనివ్వనని మరోసారి కవ్విస్తూ..
ఇప్పుడిక నీ ఆనందోబ్రహ్మలన్నీ నా జతలోనే..
కలలో కమ్ముకున్న పారవశ్యం నా సావాసంలోదే..
ముద్దుగా మోగుతున్న మౌనం నా పెదవులతీపే..

No comments:
Post a Comment