మాసాలన్నీ శిశిరాలనిపించడం సహజమేగా
నువ్వో వసంతమైయొచ్చి చిగురింతలు నేర్పనప్పుడు..
ప్చ్..ఎన్నడుగులు ముందుకేయాలో..
మన మధ్య దూరమన్నది చెరగాలనుకున్నప్పుడు..
మాటలను అనువదించలేని నీ మౌనం
కన్నుల్లో హేమంతాన్ని వర్షిస్తుంటే..
నీ తలపునక్షత్రాలు లెక్కిస్తూ నేనుంటున్నా
మన వలపు వారధిగా దారులేస్తాయనే..
నా నవ్వులు నిండుకోవడం తెలుస్తోందిక్కడ..
మనసు కాజేసి నువ్వటు మాయమవగానే..
ఊపిరాగినా ఫరవాలేదనిపిస్తుందందుకే
మరుజన్మకు తప్పక శ్వాసలోకొచ్చి చేరతావనే..
అందుకే
అక్షరాల్లో వెతుక్కుంటా నిన్ను
నా భావంతో సరిపోల్చుకుంటూ
ఎదురైన క్షణాలన్నింటా నిన్ను నింపుకుంటూ.
ఏకాంతపు ఎడబాటులో నిన్ను తడుముకుంటూ..!!
No comments:
Post a Comment