పైకి నేనో కవనపు నాయికను..లోలోన నాదో ఊహాలోకం
పైకి నేనో స్వేచ్ఛానందం..లోలోన నాకే తెలియని నిర్బంధం
పైకి నేనో సారంగీనాదం..లోలోన నేనో విషాద సంగీతం
పైకి నేనో మెరుపు ఛురిక..లోలోన నేనో పగిలిన అద్దం
పైకి నేనో ఎగిరే పతంగం..లోలోన రెక్కలు తెగిన విహంగం
పైకి నాదో ప్రేమ ప్రయాణం..లోలోన నేనో ఏకాకి స్వప్నం
ప్రతిక్షణం..
ప్రతీక్షణం..
నాకు నేనే అర్ధం కాని అద్వైతం..!!
No comments:
Post a Comment