నిశ్శబ్దం వాలిన పొద్దుల్లో
పేరు తెలియని పిట్టల గుసగుసలు ప్రేమలేఖలై
గాలి ఊసుల కిలకిలలు కవితలై
పువ్వులు పాడే సంగీతం మనసును లేపినట్టయి
కలల పొలిమేరను దాటిన కన్ను నిద్దుర వీడింది..
కల్పించికున్న సౌందర్యం రారమ్మని పిలిచింది..
తీయదనమెక్కడో లేదని తెలిసిన వేళ
క్షణాలు మీటుకున్న సంగీతం
నాతో నన్ను ప్రేమలో పడమంది
రాతిరొదిలిపోయిన నవ్వునే విరహం తడిమిందో
పెదవులనొదిలి ఉండలేనంటూ అమాంతం వచ్చి చేరింది..
ఓహ్..
ఆకాశం పిలవకపోతేనేమి
ఎగిరిపోతున్నట్టే ఉంది మరో లోకానికిప్పుడు..
అరచేతిలోని అమృతం అధరాలను తాకినప్పుడు..

No comments:
Post a Comment