నక్షత్రాల పందిరి కింద
జాబిలితో ఊసులాడినప్పుడు
నాకో మనసుండేది
నాలో నేను నవ్వుకుంటూ
ఏకాంతంలో విహరించినప్పుడు
స్వీయభావాలపై మక్కువుండేది
చూపులు తడిమిన దారులెల్లా వెలుగులు నిండేవి
మౌనాన్ని ఆవహించినప్పుడల్లా ఊహలొచ్చేవి
సంద్రంలోని అలలన్నీ నాలోనే ఊగేవి
రేయింబవళ్ళు సంభ్రమంలోనే కదిలిపోయేవి..
ఎప్పుడు జ్వరమొచ్చిందో తెలీదు
రుచి కోల్పోయిన పెదవికి దాహం పరిచయమయ్యింది
హాయిని మోసే కన్నుల్లో కన్నీరు చిందింది
మబ్బులు నిండిన సాయింత్రమంటేనే భయమయ్యింది
మల్లెపొదలు రమ్మంటున్నా ఒక్కడుగూ పడనంది
రద్దయిన స్వప్నాలనెలా ఆహ్వానించాలో
గొంతు విప్పిన కోయిలై కవిత్వాన్నెన్నడు కూయాలో..
కుంకుమవన్నెల పెదవులనెలా పూయించాలో
జీవితాన్ని ప్రేమించడమెలా నేర్పాలో..
అసలింతకీ మనసునెలా ఏమార్చాలో..:(
No comments:
Post a Comment