మంచుపూల పరిమళం ఉవ్వెత్తున లేచి
కలలు కంటున్న నన్ను ఉలిక్కిపడేలా చేసింది
అప్పటిదాకా ప్రవహిస్తున్న మత్తులో హాయొకటి చేరినట్టు
మాటలవసరం లేని అనుభూతుల సరాగాలు
నాలో స్పందనకై
ఊహలపల్లకిని మోసేందుకు సిద్ధమయ్యాయి
ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్న నక్షత్రాలు
నిశ్శబ్దంగా కురుస్తున్న కిరణాలవాన
నాలో ప్రాణశక్తినెలా దింపుతుందోనని
అకస్మాత్తుగా ఆగి నాలోకి తొంగిచూస్తున్నాయి
శీతాకాలం ఒడిలో సేదతీరుతున్నప్పుడు
పున్నమి కదిలిన దారులన్నిటా అంతమవని సుమగంధం
అనుభవానికొచ్చే ఆ గోరువెచ్చదనం మహాసుఖం..

No comments:
Post a Comment