ఆకాశమాపలేని వెన్నెల
కురుస్తూనే ఉంది రేయంతా చల్లగా
ఎవ్వరంత నిశ్శబ్దాన్ని నేర్పారో
కుదుపుతుంది మనసునిలా మెత్తగా
ఎన్ని గుసగుసలు గుర్తుకొస్తాయో..ఎంత దాహాన్ని రేపుతుంటాయో
తలపుల తోటల్లో పువ్వులన్నీ ఒకేసారి వికసించినట్టు
ఏకాంతం పరిమళిస్తుంది
మధువు తాగిన మైకమప్పుడు నక్షత్రాలతో ముచ్చటిస్తుంది
జూకామల్లెల మాలలూ..కలలో కదిలిన పాటలూ
రంగురంగుల భావాలూ..మైమరపించే రాగాలూ
ఇదంతా నిరీక్షణేమో తెలీదు
ఓ మధువీక్షణగా నా భావాలింతే..

No comments:
Post a Comment