Monday, 8 July 2024
// శుభాకాంక్షలు //
ఇన్నాళ్లూ ఎక్కడుందో కోయిల
కొమ్మల్లో దోబోచులాడుతూ పాడుతుందీ వేళ
వసంతమొచ్చిందని దానికెలా తెలిసిందో
ఆకులు చిగురిస్తూ ఆమని తాదాత్మ్యం
కాలస్పృహకు స్పందిస్తూ
పచ్చదనం పునాదిగా ప్రకృతి మెరుస్తుంది
సుతారపు మల్లె సువాసన మొదలై
చల్లని నీ జ్ఞాపకాల చినుకులుగా
నన్ను ఆసాంతం ముంచెత్తుతుంది
నిలువెత్తు భావాల నా ప్రేమ కవిత
ఉద్విగ్న పెదవుల్లో పలకాలని
ఊహల మైదానాన్ని దాటి నిన్ను చేరుతుంది
కావాలంటే నువ్వూ విను..
ఊపిరాడనంతగా వెచ్చదనం కమ్ముకుందంటే
ఈ వేసవి వాక్యాల తీయని వెత నాదేనని ఒప్పుకుంటావు
ఎప్పటిలాగే సర్వ శుభాలు కలగాలని ఆశిస్తూ..
ఉగాది పండుగ శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
పదేపదే జారుతున్న ఊహల్లో అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు నిన్నటివే జ్ఞాపకాలు.. కన్నీటితో సమంగా కాలం కరుగుతున్నా అలుపులేని అవస్థలో...
-
అవును.. మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా అది సంధ్య ముస...
-
ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో ఓ మనసు పాట ఇప్పటికీ అదే ఆర్తితో వినాలనిపించే మధువొలుకు పాట అయితే వెన్నెలొలుకు రాతిరిలో విషాదాన...
-
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు నల్లనిమబ్బులమయమైన ఆకాశం మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది ఒంటరిగా యాతన పడుత...
-
చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు నీ తడికన్నుల్లో నీరై జారిపో...

No comments:
Post a Comment