కొందరుంటారలా..
ఎదుటివారి బాధలు స్పష్టంగా తెలుస్తున్నా
కావాలనే రెచ్చగొడుతూ
తమ 'ఓటితనాన్ని' బయటేసుకుంటారు
మహాద్భుతాన్ని దర్శించాలని ఈదురుగాలికి ఎదురెళ్ళి
వ్యామోహమనే వలలోచిక్కి
కీచురాళ్ళ రొదనే వల్లిస్తుంటారు
'మాయ' తోడుగా ప్రయాణం చేస్తున్న మనిషికి
వస్తుభ్రాంతి పట్ల..
'నేను' తనం పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంటుంది
మరొకరి గుండెల్లో ఆర్తి నింపడం తెలీకపోయినా
గిచ్చి గాయంచేసే అలవాటు ఒదులుకోరు
No comments:
Post a Comment