Saturday, 16 May 2015

//సుదీర్ఘాన్వేషణ//




//సుదీర్ఘాన్వేషణ//
దుఃఖపుతెరలను ముసుగేసుకుంది మనసు
సచేతనమైన ప్రాణమైనా
సందేహ శకలాలతో సతమతమవుతూ
అనంతమైన పర్యటన..
అందబోవని ఆశలవలయంలో
ఊహించనంత పెద్దగోళాల్లో
సన్నగిల్లిన నిశ్చయముతో..చంచల స్వభావముతో
నిర్బంధించాలి మనోవిహంగాన్ని
ఖండఖండాంతరాలు దాటి విహరిస్తున్న వేగాన్ని
మానవ ప్రవర్తనలో రకాలను విశ్లేషిస్తూ
విషాద నీరదాల మాటున మగ్గిపోతున్న కలల్ని
మధ్యలో...పుప్పొడి ప్రయాణాలెన్నో..
కన్నుల్లో ధూళిగా మారి కనుపాపల మసకేస్తూ
ఏదో అసంతృప్తి..లాలస నిర్బంధముగా మారినట్లు..
దీర్ఘమైన ఊపిరి..
నిర్వికారమై అడుగుతోంది..
బదులు లేని ప్రశ్నలెందుకో..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *