//మాయాదర్పణం //
అద్దం..ఎవరికిష్టం లేదు
ప్రతీవారికీ నేస్తమేగా
నాకూ ఇష్టమే..
ఊహ తెలిసినప్పటినుండి నన్ను నాకు చూపించిందని..
లోకానికి అందంగా చూపిందని
చెదిరిన తలకట్టు సరిచేసిందని
నడకతో పాటూ నడవడికనూ దిద్దిందని..
అదంతా ఒకప్పుడు..
ప్రతీవారికీ నేస్తమేగా
నాకూ ఇష్టమే..
ఊహ తెలిసినప్పటినుండి నన్ను నాకు చూపించిందని..
లోకానికి అందంగా చూపిందని
చెదిరిన తలకట్టు సరిచేసిందని
నడకతో పాటూ నడవడికనూ దిద్దిందని..
అదంతా ఒకప్పుడు..
తర్వాత..
అమాంతంగా మార్చేసింది అద్దం
అప్పటికప్పుడు అవసరమైన భావాన్ని
అలవోకగా మొహానికి అద్దేస్తుంది..?!
నా ఉనికి కృత్రిమం చేసి
అబద్ధాన్ని నిజంగా మైమరిపిస్తుంది..
నాలోని నన్ను వేరు చేస్తూ
నలుగురిలో పేరుప్రతిష్ఠలు తెస్తోంది..
సహజత్వానికి విలువలేదని సర్దిచెప్తూ
హుందాగా ప్రవర్తింపచేస్తుంది..
తెలివిగా తిప్పికొడుతోంది
పలువురి వ్యంగ్యాస్త్రాలనూ చిరునవ్వులతో..
అమాంతంగా మార్చేసింది అద్దం
అప్పటికప్పుడు అవసరమైన భావాన్ని
అలవోకగా మొహానికి అద్దేస్తుంది..?!
నా ఉనికి కృత్రిమం చేసి
అబద్ధాన్ని నిజంగా మైమరిపిస్తుంది..
నాలోని నన్ను వేరు చేస్తూ
నలుగురిలో పేరుప్రతిష్ఠలు తెస్తోంది..
సహజత్వానికి విలువలేదని సర్దిచెప్తూ
హుందాగా ప్రవర్తింపచేస్తుంది..
తెలివిగా తిప్పికొడుతోంది
పలువురి వ్యంగ్యాస్త్రాలనూ చిరునవ్వులతో..
దాసోహమైపోతున్నానేమో అద్దానికి..
నా శరీరానికి నేనే నీడగా మారి
యాంత్రికమైన మరబొమ్మగా అవుతున్నా..
దూరం చేసుకున్నా
ఆనందపు హరివిల్లులో ఊయలూగే తన్మయత్వాన్ని..
నా శరీరానికి నేనే నీడగా మారి
యాంత్రికమైన మరబొమ్మగా అవుతున్నా..
దూరం చేసుకున్నా
ఆనందపు హరివిల్లులో ఊయలూగే తన్మయత్వాన్ని..
తెలుస్తూనే ఉంది..రంగూ రుచీ లేని జీవితం..
హృదయం గెడ్డకట్టినట్లు..బండరాయిగా మారినట్లు..
హృదయం గెడ్డకట్టినట్లు..బండరాయిగా మారినట్లు..
చూడటం మానేసా అద్దాన్ని..
అయినా తరుముతూ వెంటబడుతోందే..
అర్ధమవుతోంది కొద్దికొద్దిగా..అద్దం నాదైనా అందులో నే లేనని..
లోకమే అద్దమై నన్నిలా మార్చిందని..
నాలోని నన్ను శుష్కింపజేసి..తనకి నచ్చినట్లు నన్నాజ్ఞాపిస్తుందని..
ముక్కలు చేసేసా అద్దాన్ని..
ఎన్నిముక్కలో అన్నినోళ్ళై అరుస్తున్నాయి..
తమ కాకులగుంపుల కోయిలను కలవమంటూ
వసంతమొచ్చినా తన ఉనికి చాటొద్దంటూ..
ఇంతమందిని సంతోషపెట్టాలట..?!
అయినా తరుముతూ వెంటబడుతోందే..
అర్ధమవుతోంది కొద్దికొద్దిగా..అద్దం నాదైనా అందులో నే లేనని..
లోకమే అద్దమై నన్నిలా మార్చిందని..
నాలోని నన్ను శుష్కింపజేసి..తనకి నచ్చినట్లు నన్నాజ్ఞాపిస్తుందని..
ముక్కలు చేసేసా అద్దాన్ని..
ఎన్నిముక్కలో అన్నినోళ్ళై అరుస్తున్నాయి..
తమ కాకులగుంపుల కోయిలను కలవమంటూ
వసంతమొచ్చినా తన ఉనికి చాటొద్దంటూ..
ఇంతమందిని సంతోషపెట్టాలట..?!
వద్దనిపిస్తోంది..
ఒంటరిగా ఉండాలనుంది..
ఒక్కసారి..
లోకం నుంచీ వేరుపడి
నాలోని నన్ను స్పృసించాలనుంది..
నాకోసం నేను జీవించాలనుంది..
మాయదర్పణపు బాహువులను వీడి..
స్వేచావాయువుని పీల్చాలనుంది..
ఎలా..ఎలా..
అదేగా అన్వేషణ..!!
ఒంటరిగా ఉండాలనుంది..
ఒక్కసారి..
లోకం నుంచీ వేరుపడి
నాలోని నన్ను స్పృసించాలనుంది..
నాకోసం నేను జీవించాలనుంది..
మాయదర్పణపు బాహువులను వీడి..
స్వేచావాయువుని పీల్చాలనుంది..
ఎలా..ఎలా..
అదేగా అన్వేషణ..!!
No comments:
Post a Comment