Saturday, 16 May 2015

//ఆమె//




//ఆమె//
గుండెలమీద కుంపటి 'దిగి'పోయిందట
ఎంత ఆనందమో ఆ తల్లిదండ్రులకి
కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటానన్నారనో..
పాపం ఖర్చు లేకుండా పనిమనిషిని బేరం చేసారని తెలీకనో..
భర్తే వాడు నిజంగా..
ప్రేమను అవసరానికి మాత్రమే పంచేవాడు
భార్యకో మనసు అనవసరమని భావించేవాడు
పిల్లల్ని కనే యంత్రం మాత్రమేనని అనుకొనేవాడు
వర్షానికి గాలి తోడైనట్లేగా
ఈడైన ఆడబిడ్డలు ఓ నలుగురు పొద్దస్తమానూ.. పుట్టింట్లో
పండుగలనీ..పురుళ్ళనీ..పుణ్యాలనీ వచ్చి చేరుతుంటే
నిట్టూర్పేగా మిగిలింది..ఓదార్పు లేని నాలుగ్గోడల ఇరుకుల్లో
ఎక్కడని వెతుక్కోవాలి సుఖం.. మౌనం మనసును మింగేస్తుంటే
కష్టసుఖాలు పంచుకొనే తోడే కరువైతే..
ఎక్కడని విశ్రాంతి..పచ్చని తోరణమంటి గడుపలో నిత్యసందడైతే
అరే..ఒక్కసారిగా మారిందిగా జీవితం
తానూ గర్భవతిననే తీయని కబురుతో
వేచి చూడాలిక మరో పాపని కని విచారిస్తుందో
వారసుడ్ని కని జీవితంలో మరో మెట్టేదైనా ఎక్కుతుందో..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *