Saturday, 16 May 2015

!!నాలో నేను!!



!!నాలో నేను!!
గమ్యంలేని పయనం
నాలోని ఆకాశంలో నేను..
ఊహా ప్రపంచమేమో
అంచులెరుగని అద్భుతలోకంలో..
ఆనంద వీచికలెన్నో
పెదవంచున నిష్కారణపు నవ్వుల్లో..
నవరాగ సంగీతమే
మనసుపొరల మౌనరాగ సం యోగంలో..
అలలై ఎగిసే కలలే
అలమోడ్పు రెప్పలకౌగిలి దోబూచులాటలో..
ఏకమవుతున్న అనుభూతులే
ఇరువురమొకటై పూచిన గంధపుపువ్వులో..
అంతా తన్మయత్వమే
అంతరంగపు ఆత్మీయతరంగాల ఆలింగనములో..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *