Saturday, 16 May 2015

//నిశ్శబ్ద ఖేదము//






//నిశ్శబ్ద ఖేదము//
పురుగులేవో తొలుస్తున్నవి..
ఆలోచనలు నిండిన మనసు కదా
అంతమవని వేదన సాక్షిగా..
అనంతమైన ఆకాశపు నీడలా
పరస్పరభావాల వేదికై..నిరంతరఘర్షణ నిప్పురవ్వలై
బుద్ధి స్వాతంత్రానికీ..ధర్మ శాస్త్రానికీ ..
కర్మ సిద్ధాంతానికీ..వర్తమాన స్వేచ్ఛకీ
నడుమ జరిగే పోరాటంలా...
లేని సమస్యవలయాల ఊయల్లో
చావుభయాన్ని తలపోస్తూ..
శోకతప్తమైన ఆర్తనాదమై
మస్తిష్కం అగ్నిగోళమై..చిందరవందర తలపుల్లా..
హద్దులెరుగని ఆకాశహర్మ్యాల్లా
అపరిమితమైన ఊహలు..
రసహీనమైన ఉపరితలంలో..డోలాయమైన హృదయపు సందేహాలు..
సామాజిక అసమానతలేనేమో..
కళ్ళ ముందు వ్యాధిగ్రస్థమై కనిపిస్తూ..
వర్గపీడన, లింగ వివక్ష, దైనందిన హింస
జీవన వేదనకు మరింత సంఘర్షణ జోడిస్తూ..
పయనమెటో తెలియక..
చీకట్లోంచి తిరిగి చీకట్లోకేనానని..!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *