Saturday, 16 May 2015

//నేటి మహిళ//





//నేటి మహిళ//
సవ్యసాచి కదా ఆమె..
బహుళపాత్రల నైపుణ్యమేగా ఆమె
జీవిత విలువను గ్రహించగలదు
తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలదు
ఆమె లక్ష్యాలను అందుకోగలదు
తన కలలను సాకారం చేసుకోగలదు..
తనను తాను గౌరవించుకోగలదు
వాస్తవికంగా ఆలోచించనూగలదు
కూతురుగా ఇంటిమన్నన పెంచగలదు..
భార్యగా అనుకూలంగా ఉండగలదు..
కోడలిగా బాధ్యతను నిర్వహించగలదు
అమ్మలా కుటుంబసంక్షేమాన్ని సంరక్షించగలదు
అందుకే చెప్తున్నా..
సర్వగుణ సంపన్నులే నేటిమహిళలు
సం క్షోభాల్ని చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరవనితలు
అడుగేసిన ప్రతీరంగంలోనూ విజేతలు
సాధికారతకు ఉదాహరణలే మా ముదితలు
సర్వాంతర్యాములే నేటి స్త్రీమూర్తులు..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *