//కవితా వసంతం//
కవితా వసంతమట..
సాహితీసేవకు ముస్తాబు కమ్మంటూ మనసుకోకిల
కవి సంగమాలట..
అతిరథుల చిత్తాలను ఆలకించొచ్చనే ఆనందమట
మంగళ తోరణాలట..
కళామతల్లి గడపకి అక్షరాలతో అలంకరణలట
కవి సమ్మేళనాలట..
రసహృదయాల మేలవింపులో రాగమై కలిసేందుకట
అక్షర విన్యాసాలట..
అనువైనభావాల అల్లికలతో మనసుపైన పందిళ్ళట..
కవితా కెరటాలట..
రసవాహినిలోని తీరపు అలలతో జలకాలట
కావ్య కన్నెలట..
వర్ణనాతీతమైన చిలిపి పరువపు ఆకర్షణలట..
చైతన్య స్రవంతులట..
అనుభూతి అంతర్నిహితమైన భావాల హర్షాతిరేకాలట..
మునుపెరుగని నవ్యానుభవమట..
ఆనందరాగపు తీపి మరకల ముచ్చట్లట..
మది విహంగమవునట..
వసంతరాత్రుల వైభోగాలు కన్నులకు పండుగలట..smile emoticon
సాహితీసేవకు ముస్తాబు కమ్మంటూ మనసుకోకిల
కవి సంగమాలట..
అతిరథుల చిత్తాలను ఆలకించొచ్చనే ఆనందమట
మంగళ తోరణాలట..
కళామతల్లి గడపకి అక్షరాలతో అలంకరణలట
కవి సమ్మేళనాలట..
రసహృదయాల మేలవింపులో రాగమై కలిసేందుకట
అక్షర విన్యాసాలట..
అనువైనభావాల అల్లికలతో మనసుపైన పందిళ్ళట..
కవితా కెరటాలట..
రసవాహినిలోని తీరపు అలలతో జలకాలట
కావ్య కన్నెలట..
వర్ణనాతీతమైన చిలిపి పరువపు ఆకర్షణలట..
చైతన్య స్రవంతులట..
అనుభూతి అంతర్నిహితమైన భావాల హర్షాతిరేకాలట..
మునుపెరుగని నవ్యానుభవమట..
ఆనందరాగపు తీపి మరకల ముచ్చట్లట..
మది విహంగమవునట..
వసంతరాత్రుల వైభోగాలు కన్నులకు పండుగలట..smile emoticon
No comments:
Post a Comment