Tuesday, 17 November 2015

//విన్నపం//






//విన్నపం//
ఎందుకు నాన్నా..నేనంటే అంత కోపం
ఎంతసేపూ ఎదుటివారితో పోల్చుతావెందుకు
వారితో సమానంగా లేనని వాదిస్తావెందుకు..
శరీరంలో అణువణువూ మూగగా రోదిస్తోంది..
నీ మాటలు శూలాలై పొడుస్తుంటే..
నువ్వు కన్న కలలు నిజమే..
నాకో స్థానం కలిగించాలని ప్రపంచంలో..
రాయిని సాన పెట్టి రత్నంగా మలచాలన్న నీ ఉద్దేశ్యమూ గొప్పదే..
కానీ..
శారీరక వ్యాయామంతో పాటూ మానసిక వ్యాయామమూ అవసరమేగా నాన్నా
ఆటపాటల్లో ముందొస్తుంటే నా వెన్నెందుకు తట్టవు
గెలుపు ఇచ్చిన ఆనందం ఏ వ్యసనమూ ఇవ్వదంటారు
కానీ ఎందరు మెచ్చినా..
నాకు నచ్చిన నువ్వు మెచ్చందే ఆ గుర్తింపుకర్ధమేది నాన్నా
ఎంతసేపూ చదువే అంటే నాలో ఉన్న సృజన ఏమైపోవాలి నాన్నా..
పుట్టినప్పుడే వివక్ష లేదుగా..ఎదిగాక ఎందుకిన్ని ఆంక్షలు..
చిన్నప్పుడు వేలు పట్టుకు నడిపించిన నువ్వే..
నీ మాటలు పెడచెవిన పెట్టానంటూ విసుగుతున్నావు..
జీవితాంతం వెంటాడే మధురజ్ఞాపకాలను పోది చేసుకోనివ్వు..
ఎందుకిలా జరిగిందనే కారాణాన్ని వెతుక్కొనే అవకాశమివ్వకు నాన్నా..
నన్ను నన్నుగా నీ కంటిపాపగా నీ కనుసన్నలలో మెలగనివ్వు..
రూపాంతరం చెందని నా ఊహలకు నీవు రెక్కలిచ్చి ఎదగనివ్వు..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *