Monday, 16 November 2015

//ఆశా జ్యోతులు//




//ఆశా జ్యోతులు//
ఆడపుట్టుక శాపమంటారు..
అదీ పెళ్ళి కాని ఆడపిల్ల వయసు మోస్తూ శాపగ్రస్థులైన కన్యలా కదులుతుంటే..
ఆ పిల్లకి తండ్రి కావడం మరింత శాపమనుకుంటూ...
అర్థంలేని ఆంక్షలు విధిస్తూ ఆమెపై..
ప్రతీ పనికీ అనుమతి తీసుకోవాలని హెచ్చరిస్తూ..
చదువూ..ఆర్ధిక స్వాతంత్రం ఉన్నా..
మాటకు విలువ దక్కని విచిత్ర మధ్యతరగతి సంప్రదాయం..
జీవితంలో సర్వహక్కులూ పుట్టించిన తల్లిదండ్రులవేనని తలచే ఆడపిల్లలు..
తల్లిదండ్రులు మంచికే చెప్తారని సర్దుకుపోయే అతివలెందరో
అందుకే గుండెలపై ఉన్న తమ కుంపటిని వేరే మగాడికి బదలాయిస్తూ..
వారి ఆశలను కూకటి వేళ్ళతో కూల్చేస్తూ..
అసలే అర్ధహీనమైన బ్రతుకును ఖాళీగా మారుస్తూ..
జీవితాన్ని సీసం బరువుతో లాగినట్లు
తాహతుకు మించి గొప్ప సంబంధం వెతికి చేయాలనుకుంటారు..
ఇహ...
మగాడు...తన పన్లు తాను చేసుకోవడం రానివాడు..
ప్రతీ కోరికకూ ఆమెపై ఆధారపడేవాడు..
వంశాభివృధికి ఆమె తోడు అవసరమనేవాడు..
మరో కొత్త ప్రపంచాన్నీ సృష్టించాలని ఆశించేవాడు..
వాడికో అదుపు కావాలంటే..అదీ ఆమే కావాలనేవాడు..
కేవలం సంపాదన మాత్రం చేతనైనవాడు..
అది చేతనయిన ఆడది మగాడు వద్దనుకుంటే ..
వాడి గతేం కావాలో..వాడి ఆశలెలా తీరాలో..frown emoticon

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *