Monday, 16 November 2015

//వికృతి//





//వికృతి//
ఆమె కలలుగన్న భవిష్యత్తు ఎదురుచూపుల పానుపు వంటిది..
ఆ పానుపు నిండా ముళ్ళే పరచుంటే..?!
తాను అనుకున్నట్లు జరుగుతుందనుకున్న జీవితం..
జరగరాని పరిస్థితుల్లో దిక్కుతోచని వైనం..
కేవలం ఓ మరబొమ్మగా ఇంద్రియసుఃఖాలను దోచేస్తూ..
అమె జీవనమంతా కృత్రిమంగా యాంత్రికంగా మార్చేస్తూ..
పురుషాంకార ఆధిక్యతాభావంతో మదమెక్కిన పొగరు..
ఆపై నాగరికత ముసుగులో సిగ్గులేని నగ్నత్వంలో వాడు..
ఎంచవద్దంటూ నేరాలు అపరాధాలు అవలీలగా చేసేస్తూ
యుగయుగాల వ్యర్ధప్రయత్నంలా ఆమె ఏడుపు..
మనుగడనాపేసి చచ్చేదాకా పంజరంలో బందీగా ఉండమని శాసించినందుకు..
జవాబులేని ప్రశ్నలు వేలకు వేలై వేధిస్తుంటే..
వాడికేం కావాలో తెలియనితనమో..
అమె ఏం దాచిందోనని అనుమానమో..
ఇహ..కాలుస్తూనే ఉంటాడేమో అలా...
సజీవదహనమయ్యేదాకా ఆమె హృదయాన్ని..!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *