Tuesday, 17 November 2015

//సెల్ఫీ//





//సెల్ఫీ//
ఎంత చిక్కు సమస్యో..
ఒక మంచి పనిని మెచ్చడానికి మాటలు తడబడటమెందుకో..
ముఖకవళికల్లో ప్రవహించే రహస్య సంఘర్షణ..
వెలువడే పెదవులకు సంఘీభావమివ్వక
అదో చిన్నతనమని భావననుకుంటా..
మెచ్చుకుంటే చులకనైపోతాననే స్వభావమో..
ఎదుటివారు సక్రమంగా స్వీకరించరని అనుమానమో..
తననెవరైనా అభినందిస్తే అమితానందమే..
ఎదుటివారి ఆలోచనలూ..ఆశయాలూ ఎందుకంత చులకనో
ప్రశంసకున్న శక్తి సామాన్యమైంది కాదుగా
ప్రతీ వ్యక్తిలోనూ ఏదో వైవిధ్యం..అదేగా సృష్టి విచిత్రం
అది గమనించి మెచ్చుకోగలిగితే అపరిమితమే ఆనందం
మనస్ఫూర్తిగా ప్రశంసించలేకపోవడమో లోపం
అది సవరించుకోలేకుంటే భవిష్యత్తులో మానసిక శాపం
అయినా..
మెచ్చుకోకుంటే పోయేదేముందిలే..
మహా అయితే నీ మనస్తత్వం బయటపడుతుంది తప్ప... !

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *