Tuesday, 17 November 2015

//అస్తిత్వ విలువ//





//అస్తిత్వ విలువ//
ఎంత సిగ్గుపడిందో ఆమె
అడిగిన ప్రశ్ననగా ఏముందని..
ఏ ఉద్యోగం చేస్తారన్న కారణానికి..
గృహిణిగా బాధ్యతను మోస్తానని చెప్పలేక
ఉద్యోగం చేయలేకపోవడం చిన్నతనముగా భావిస్తూ
ఉన్నత చదువులేక ఆర్జించడం రాదని యోచిస్తూ..
ఆదాయం లేదని అవమానాన్ని దిగమింగుతూ..
వెలకట్టలేని తన విలువను తానే ఎరుగక..
ఆలోచిస్తే..
ఒక ఇంటి విజయమంతా ఆమెదేగా
ఒడిలోనే క్రమశిక్షణ మొదలుపెట్టిన తల్లిగా
లక్షలార్జించే లక్షణాలను పెంపొందించిందిగా
సమయానుకూలంగా భర్తాపిల్లలకే సేవచేస్తూ
అందరి ఆరోగ్యాలని సైతం సంరక్షించిందిగా
అలుపులేక ఇరవైనాలుగ్గంటలూ సమర్ధవంతంగా పనిచేస్తూ
ఇంటిని ఓ సంతోషనిలయంగా మార్చిందిగా..
అయినా సరే..
ఆర్ధిక స్వాతంత్ర్యం లేదనే మానసిక వైరాగ్యమో..
సాటి ఆడవారు గుర్తించలేదనే భావ శూన్యమో..
భిన్న దృక్పథాలతో మనసును ముక్కలు చేసుకుంటూ
ఆమె విలువైన అస్తిత్వాన్ని కాపాడుకోవడం చేతకాక
అసంతృప్తి నీడల్లోకి తొంగి చూసి ఉలికిపడుతూ..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *