Tuesday, 17 November 2015

//గ్రీష్మపత్రం//






//గ్రీష్మపత్రం//
ఒంటరితనంలో కలిగే వైరాగ్యం..
గతించిన జీవితపుటలు తిరగేస్తుంటే నాకు..
మృదుత్వాన్ని కోల్పోయిన కపోలాలు..నీ విరహానికి నీరసించి..
అప్పుడప్పుడూ మెరుస్తున్న మెరుపులతో హృదయాంబరం..
మూసితెరిచే అరమోడ్పు రెప్పల్లోని నీ ప్రతిరూపంలా..
ఆకాశ హరివిల్లులో ఊయలలూగిన ఊహలు..
కన్నీరు కరిగి నీరై వాగై ప్రవహించినట్లు..
గాలికెరటమై కౌగిలిస్తూనే ఉంటావు..
అలవికాని దుఖం నన్నావహించినప్పుడు..
నీకు సంబంధించిన ప్రతీదీ అందమైనదే..
ఒక్క నిర్జీవమైన నా హృదయం తప్ప..
ఏమో మరి..
నువ్వు ఔనన్నా కాదన్నా..
నీ కిన్నెరవీణకు రాగాలందించిన ప్రేయసి నేనే అనిపిస్తుంది..!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *