Tuesday, 17 November 2015

//నిరుద్యోగి పయనం//






//నిరుద్యోగి పయనం//
మహనగరమే అది..
వేలకువేలు మకిలి పట్టిన భవన సముదాయాలతో..
దుమ్ము కొట్టుకు వ్రేలాడే ఆకులూ..పువ్వులే లేని కాడలు..
వేలాది కిటికీలున్నా.. జీవంలేని గదుల్లో ఉక్కబోతలు..
చీకటి గొయ్యలను తలపించి చిన్నచిన్న గదులు..
ఎవరి అవస్థ వారిది..ఎవరి బతుకు వారిది..
ఒంటరిగా..రహస్యంగా..బరువైన దుఃఖాన్ని మోస్తూ..
విచక్షణలేని మరబొమ్మల్లా..క్షణం తీరిక లేక పరుగులు పెడుతూ..
ఒకరినొకరు పలకరించుకోక..చచ్చినా తొంగి చూసేవారు లేక..
గతంలో జారిపోయినవారూ..ప్రస్తుతానికి పనికిరాని వారూ..
భవిష్యత్తు తెలియనివారూ..అవిరామంగా సంచరిస్తున్న వారూ..
లక్షలాది లక్షల్లో వాడొకడు..గాలిలో..గుంపులో..
తిరగరాని చోట్ల తిరుగుతూ..పడరాని అగచాట్లు పడుతూ..
బ్రతికి బాగుపడితే ప్రకాశించాలని..పదునైన పల్చటి తీగపై నడుస్తూ..
గెలవాలనే పట్టుదలే ధ్యేయంగా..జీవితాన్నింకా ప్రేమిస్తూ...
చిరుద్యోగమైనా సాధించాలని రక్తాన్ని స్వేదంగా మార్చి కరిగిస్తూ..
యదార్థ పోరాటంలో విజయాన్ని కాంక్షిస్తూ..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *