Monday, 16 November 2015

//మామిడిపళ్ళు//




//మామిడిపళ్ళు//
ఒక్కమారు రసప్రవాహమైంది మది..
మామిళ్ళనలా చూపులతో తడమగానే
వర్ణించనలవిగాని వర్ణశోభ..
ఒక్కో రకం, ఒక్కో రుచి, ఒక్కో రంగు, ఒక్కో పరిమళాన్ని
పుణికి పుచ్చుకున్న మామిడిపళ్ళు..
చెరుకురసాలట..చవులూరిస్తూ ఎదలో..
సువర్ణరేఖలట..సింధూరపు పొద్దును పూసుకుని నోరూరిస్తూ..
ముగ్గిన బంగినపల్లి..లేతపచ్చని తీపులతో కవ్విస్తూ
హిమాంపసందు..కనుదోయికి పసందైన విందవుతూ
నీలాలూ..కొబ్బరి మామిళ్ళూ..
ద్విగిణీకృతమైన లేతమామిళ్ళ మధ్య వేవిళ్ళను తలపోస్తూ..
ఉభయగోదావరులదెంత అదృష్టమో..
వసంతగ్రీష్మాల్లో విరగాచిన మామిడి తోటలతో అలలారుతూ..
ఇహ..మామిడిపళ్ళదెంత వైభోగమో..
వన్నెతరగని మంగళకరమైన మన్మథఫలమని కొనియాడేందుకు..
రుచిలో సాటిలేని రాజఫలమని చాటిచెప్పేందుకు.

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *