Tuesday, 17 November 2015

//త్యాగం//





//త్యాగం//
నీ నేత్రాల ఆవ్యాజప్రేమలోనేగా నాలో అనురాగబీజం మొలకెత్తింది..
ఆ మధురభావాల సంపెంగల్లోనేగా నా సిగ్గులు దాచుకుంది.
ఆపాత మధురాల సంగీతంలా నేనుంటే..
అమృతమైన సాహిత్యమై చేరావుగా నన్నే..
నీలో త్రిపథగామినిగా మారనప్పుడే..
నీ చూపుల్లోంచీ అంతఃచక్షువులోకి..తద్వారా మనసులోకి ప్రవహించినప్పుడే
నీ అంతరంగ ప్రేయసినని గ్రహించానప్పుడే..
నీ హావభావలలో అనురాగం ప్రకటితమైనప్పుడే..
కమనీయప్రబంధాలెన్నో చదివేసానప్పుడే..
నా కెంపు పెదవులపై నీవు కవిత్వం రాసినప్పుడే..
నా ఉనికినీ కోల్పోయానప్పుడే ..
ఆత్మానందానికి అంతిమస్థాయివంటూనే..నీ మౌనరహస్యంలో నన్ను దాచినప్పుడే
ప్రేమను ప్రేమగా త్యాగం చేసానందుకే..
ప్రణవమున్నంతవరకూ తోడుంటాననే ప్రతినని పక్కన పెట్టి దాటేసావని..!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *