Tuesday, 17 November 2015

//అందాల గోదావరి//






//అందాల గోదావరి//
గోదావరీ..
ముక్కోటి తీర్ధాల పుణ్యశాలి
అన్నపూర్ణయై ఆకలి తీర్చు భాగ్యశాలి
పాపాలను తొలగించి పుణ్యమొసగు పరమపావని
ఎన్నో జన్మాల తపోఫలమీ అమృత వరదాయిని..
నిదురలేచిన ఏరువాకలా వెల్లువయ్యింది తూరుపున గోదారి లంకదారుల్లో..
ఉదయంపు గోదారి ఉరకలెత్తే గుడిగంటల మేలుకొల్పు రాగాలతో..
మిలమిల మెరిసే వజ్రంపుపొడై మధ్యాహ్నపు గోదారి మైదానాల్లో
వెలిసిందొక వానవిల్లై సాయం సంధ్య గోదారి కనుసన్నల్లో
పువ్వులూ నవ్వెను నిద్దురలో చల్లని వెన్నెల గోదారి అందంలో..
మేలిముత్యం సైతం వెలిసిపోయింది ఆమె నురుగుల తెల్లదనంలో
ఒయారమే విస్తుపోయింది ఆమె అలల సోయగపు నడకలలో
గుండే ఊసులాడింది తరతరాల స్మృతుల తరంగాలలో
హృదయాలాప శృతి మించింది ఆమె సౌందర్య వర్ణాలతో..
గుప్పిట్లో బంధించలేను మన గోదారి అందాన్ని..
ఆనందం ఎడద దాటి ప్రవహించి పోతుంటే

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *