Monday, 16 November 2015

//పరుగో పరుగు//





//పరుగో పరుగు//
ఎందుకన్ని పరుగులో వాడు..
రేయింబవళ్ళు పరుగు..
అవగాహనలేని పరుగు..నమ్మకం కరువైన పరుగు..
తనని తాను విడిచిపెట్టి మరీ పరుగు..
సత్యానికి భయపడి నీడల్లోకి పరుగు..
ఉనికి చాటుకోడానికి మొదలెట్టిన పరుగు ..
ఎటు మొదలెట్టాడో తిరిగటే చేర్చిన గుండ్రటి పరుగు..
మితిమీరిన ఆంక్షల అన్వేషణలో పరుగు..
ఇంద్రియాలను అనుసరించే పరుగు
నిత్యం అరిషడ్వికారాలతోనే సహజీవనం చేస్తూ పరుగు..
మనసు మాత్రం విస్మరించిన పరుగు..
జీవితాన్ని సొంతం చేసుకోవడం రాకేమో..
ప్రకృతిని వీడి యాంత్రికమైన పరుగు
కీర్తికండూతికీ, అధికార దాహానికీ దాసోహమైన పరుగు..
ఎప్పుడు పరుగాపి నిలబడగలడో..అప్పుడేగా సగం గెలిచినట్లు..
ఎప్పుడైతే మనుషులంతా ఒక్కటని భావించునో..
నిస్సందేహంగా అప్పుడేగా జీవించగలడు.
ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చినట్లు..
ఒకే ఆకాశపందిరి కింద మనమంతా కలిసున్నామని..
ఒకే గాలి కలిసి పీలుస్తున్నామని..
పరుగాపి ప్రకృతిని వింటే చాలదా...
జీవితానికో సంపూర్ణత్వం సిద్ధించదా..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *