Monday, 16 November 2015

//ఆ కనులు//




//ఆ కనులు//
ఆ కనుబొమల విలాసంలోనే తెలుస్తోందిగా
ఆమె ప్రేమంతా కన్నుల్లోనే దాచిందని..
అసలే నల్లని కన్నులు..ఆపై మహా గర్వం..
ఆ కరిమబ్బే తన కాటుకను కాజేస్తోందని..
చాటుపద్యాల గుసగుసలకు ప్రేరణయ్యిందని
ఎన్ని అలుకలను అభినయించెనో ఆ కన్నులు.
క్రీగంటి సైగలతో కట్టేస్తూ..కపోలాల ఎర్రదనాన్ని దోచేస్తూ..
ఇక ఆ కాటుకల కులుకులకేం తక్కువలే..
నీ రూపాన్ని కన్నుల్లో పదిలంగా దాచిందని..
విరహాన్ని ఆమడదూరంలో తరిమిందని...!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *