//తోడేలు//
కూపస్థమండూకంలా వాడు
ఏ సుడిగుండపు లోతులు కొలిచాననుకున్నాడో..
మస్తిష్కపు పొరల కింద నల్లని జ్ఞాపకాలను దాచుకున్నాడో..
పాచి మరకల నాలుకతో..
కనుపుస్సుల జిగటుదనంతో వికారంగా..
గతాన్ని తవ్వి చూసుకున్నడేమో
ఎన్ని జుగుప్సలు గుర్తొచ్చాయో..
ఏ దుర్గంధాన్ని వంటికి పూసుకున్నాడో
ఎన్నెన్ని కుబుసాలు విడిచి రోజులను తొడుక్కుంటాడో..
కొత్తరుచుల కోసం ఎంగిలాకుళ్ళలో వెతికేవాడు
కుతూహలం రేపే కలవరంతో కొట్టుకుపోయేవాడు
ఒంటరిపాము భీభత్సంలో బుసకొట్టినట్లు..
ఏ స్వకీయ అనుమానపు నీడలు కమ్ముకున్నాయో..
భుజాలు తడుముకొని మరీ ఉరుకుతున్నాడు..
వెనక్కి సైతం చూడక పలాయనం..
అద్దం కొనుక్కోవడానికయ్యుంటుంది..
ఆ పలుగాకులకు కనిపించేందుకు మెరుగులు దిద్దొద్దూ..
అద్దం వెనుక అవకరం దాచోద్దూ..
సాధ్యమైనంత ఆదర్శవంతంగా కనపడొద్దూ..
ఆ పైశాచిక వికృతానికి రంగులు పూయొద్దూ..
ఆ మాత్రం ప్రయోజకత్వాన్ని తన కవిత్వంలో చూపొద్దూ
ఏ జీవితపు పొలిమేరల్లోనో చూసుకుంటాడేమో..
చిరిగిన తన ఏకాకితనాన్ని..
తాను కోల్పోయిన అస్తిత్వపులోతుల్లోని అనుభవాన్ని...!!

No comments:
Post a Comment