Tuesday, 17 November 2015

//కృతజ్ఞత//







//కృతజ్ఞత//
ఎంత ఉత్తమమైన భావనది..
విశ్వశక్తిని ఆవాహన చేసేందుకు
"మెచ్చుకోలు" అనే పునాదిరాయి అంచున నిలబడి..
విశ్వాసానికి వశమైన ఇంద్రజాలాన్ని చూపుతూ..
కృతజ్ఞత వల్ల ఆనందం కలుగుతోందనేగా..
ప్రతీవారిపట్లా కృతజ్ఞులమై ఉండాలనిపించేది..
మనసులోని నిరాశను, నిర్లిప్తతను, ఒత్తిడిని కడిగేస్తోందిగా..
సవాళ్ళను..అపజయాలను సానుకూలం చేసేస్తూ..
పని తీరు మెరుగవుతోందిగా..
జీవితంలో పునరుత్తేజాన్ని నింపినందుకు..
వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తున్నందుకు..
కానీ..
ఏరు దాటాక తెప్పను తగలేస్తారెందుకో కొందరు..
అవసరం తీరాక కృతజ్ఞత అనవసరమని భావిస్తారు కాబోలు..
ఇంద్రియానుభవం ఇవ్వని గతానుభవాలు తవ్వుకోవడమెందుకనేమో..
తమ ఉనికినే మరచి ఉరకలేస్తారు..వెనుదిరిగి చూసే ధైర్యం లేక..
మనలను ద్వేషించే వారిపట్ల సైతం కృతజ్ఞతగా ఉండటం రావాలి..
మనలో మానసిక స్థైర్యాన్ని వారు నింపినందుకు..
చివరిగా..
సంఘజీవిగా ఉన్నందుకు..
ప్రేమించే అరుదైన అర్హత మనకున్నందుకు..
సర్వదా కృతజ్ఞులమై ఉండటం తెలియాలి..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *