Monday, 16 November 2015

//నీ పరిచయం//



//నీ పరిచయం//
ఆనాటిమాట,.
ప్రభాతగీతాల పల్లవిలో చరణాల జాడలేమయ్యేనని..
విషాద్రాశ్రువుల చినుకుల్లో ఆనందపు స్వాతిముత్యాలెరుగనని..
కాలాతీత ప్రేమల్లో నవపద్మరాగాల సవ్వడెక్కడుందని..
స్నేహరాహిత్య హృదయంలో భావోద్వేగాల మనసుకి కదలికేదని..
మౌనగంభీర సాగరంలో ఉరకలెత్తే అలలేమవునోనని..
శారదరాత్రుల విరహంలో పెదవంచుకి చిరునవ్వులేల పూయునని..
విలపించడమెందుకనిపించింది..
గగనకుసుమం అందని జాబిల్లని గ్రహించుకుందిగా మనసని..
ఒక్కసారిగా ప్రపంచం మారింది..
ఆకాశమే హద్దుగా కవిత్వాన్ని ప్రేమగా ఆహ్వానించాక...
ఆ పాలపుంతనే తెచ్చి ఊహల్లో నింపింది..
పూలమరందాలను అలవోకగా మనసులో ఒంపింది..
గ్రీష్మంలో వసంతం తిరిగి చిగురించింది..
కోయిల కూజితంలోని మార్దవం వినిపించింది..
భావమాలికలను గుచ్చి మెడలో హారమేసింది..
రంగులీను సౌందర్యావిష్కరణ కన్నుల్లో దోగాడింది..
చిక్కని చీకటి రాత్రుల్లో సిరివెన్నెల కురిపించింది..
హృదయతంత్రుల్లో సన్నాయిరాగం మీటినట్టయ్యింది..
పున్నాగుల పొదరింట్లో ఎద సేద తీరింది
ఆడంబర మనస్తత్వంలో సంకుచితం తెలిసింది..
కూసింత తనివైతే తీరింది..
అనుభూతిని అక్షరం చేయగలిగానని..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *