Monday, 8 July 2019

//ఊహలమత్తు..//


తలుపులు తెరిచినంత తేలిగ్గా తలపుల్లోకి వచ్చేస్తావు..
నా మనసిచ్చిన ఆతిధ్యమంత నచ్చిందా..
ఇన్నికాలాలు ఎక్కడెక్కడ తప్పటడుగులేసావో తెలీదుగానీ..
నా ముందిన్నాళ్ళకి మోకరిల్లావు..
నువ్వొస్తూనే ఆవేదనంతా ఉస్సూరుమంటూ ఎటుపోయిందో..
నీ మాటల్ని ఆలకిస్తున్న ఆనందం తెలుస్తోంది..
తెరలుతెరలుగా పరచుకున్న ఊహల మత్తులో
వసంతానికి ముందే నే కోయిలనైపోయానంటే నమ్మవా..
కొన్ని కూజితాలైనా నీతో పంచుకోవాలనే చెప్తున్నా..

విరహమంటని వేసవనేగా..
మనసులో పూసిన మల్లెల తోటలు..
ముందు జన్మల పరిమళాన్ని గుర్తు చేస్తున్నాయి ఒక్కసారిగా..

ఈ మంతనాలు చాలిప్పటికి..
జాబిలి వేళకు కాసిని దాచుకుందాం..😊

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *