పూలగాలి
రెక్కలు మోసుకొస్తున్న గుసగుసల్లా కొన్ని పరిమళాలు..నాపై ఇష్టాన్ని నువ్వు
చల్లుతున్న ఆనవాళ్ళుగా..దీర్ఘమైన ఎదురుచూపుల్లో రవ్వంత అనుభూతి నన్ను రాగం
చేసి పాడుకొనే నీ పాటదైనట్టు చెమ్మగిల్లిన మనసు
నీ చిరునవ్వుల దీపాలతో నాలో చీకటి తొలగినందుకేమో ఈ సంగీతాలు..నిరంతరమో వసంతమై కొన్ని వర్ణాలు రాగభరితమైన సంతోషాలు..
గుండెనిండిన పరవశాన్ని కాలమాగి చూస్తున్న విచిత్రంలో కనురెప్పల వెనుక ఆగని తడి..అడగని వరం ప్రేమమాలై వరించిన వైనం..ఇప్పటికో అంతుపట్టని ఇంద్రజాలం
మళ్ళీ మళ్ళీ చెప్తే వినాలనుంది..నీ మునివేళ్ళు నన్ను తాకేందుకు తడుముకున్న స్వప్నంలో నేను దొరికానోలేదోనని..😍

No comments:
Post a Comment