ఊహలవేగాన్ని
కలుపుకున్న జీవనదిలా ప్రవహిస్తున్న రుధిరం శిశిరాన్ని దాటేసి.. వసంతంలో
కురిసే చిలిపి చినుకులకి చిగురించిన పూలవనాన్ని తడిపే మకరందంలా
తీయనయ్యింది..
నిశ్శబ్దం కరిగిన ఆనవాళ్ళుగా కొన్ని రాగాలు తీగలై సాగి ఎన్ని పల్లవుల్లో చేరిందో నేను రాసేదంతా వలపు మౌనాక్షరం ఒకప్పుడు
ఏమ్మత్తు చల్లావో ఇన్నాళ్ళూ ఊపిరిలో దాగిన పరిమళాలు మనసుకొస దాటి నిన్నల్లుకొని ఇష్టపదుల బంధమేసేందుకని నీతో కాలయాపనలో చేరాయి..
నీ జతలో కనుగొన్న సంతోషం విషాదాన్ని తరిమి పులకరమూగడమెప్పుడు నేర్పిందో మరి..ఉత్సాహం పెనవేసుకున్న ఆశలే ఇప్పుడన్నీ..
మౌనాన్ని ముగ్ధంగా రాల్చేసుకున్న ఊసులు నీకూ నాకూ నడుమ వేసుకున్న వంతెనలో ఎన్ని భావాలు పంచుకునేందుకో వెన్నెల్ని ఎరగా వేసి రాత్రిని పిలిచాయి
కలలను వెంటాడినట్టుండే నీ చూపులు గుసగుసను ప్రసరించినందుకేమో నాలో మొదలైన ఆర్తి ఓ సరికొత్త తపనగా అనిపిస్తోందిప్పుడు ..
నెమలీకలై తాకుతున్న ఈ పరవశానికి పేరేం పెడతావో..
నేనైతే మధురంగా ఆలకిస్తున్నా ఇష్టమైన తతంగాన్నిలా..💜💕

No comments:
Post a Comment