Monday, 8 July 2019

//మల్లెల సాక్షి//


ఇన్నాళ్ళ నా నిశ్శబ్ద ప్రపంచంలోకి సందడిలా నువ్వొచ్చావు..

నాలోని తడి దిగులుకు రెక్కలిచ్చి...

వసంతంలోని ఆహ్లాదంలా చుట్టుముట్టావు..!

తలపుల తతంగాన్ని ఎలా గమనించావో

ఊహల కౌగిలిలో కాలాన్ని కరిగించేందుకు

నాతో నువ్వున్నట్టు సంతకాన్ని చేశావు..!

కలలతో నా రాత్రిని నిద్దుర లేపి

నేను వినాలనుకున్న నాలుగు మాటలకు

సంగీతాన్ని చేర్చి పాటగా పలకరించావు..!

కొన్ని భావాలకు పరిమళమబ్బినట్టే

ఆ అనుభూతి నీ సాహచర్యంలోనిదని

మల్లెల సాక్షి.. మత్తుగా పరవశించాను...

నాలో ఆశలు చిగురేసే ఒక వాక్యం కోసం శిశిరాన్ని భరించాను,

అన్నట్టూ... చిరుగాలి వాసన కూడా బాగుందిప్పుడు...

వెలిసిపోని రంగేదో నువ్వొచ్చి చల్లినట్టు..💕

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *