Monday, 8 July 2019

//నీ ధ్యాసలో ..//


అందనంత దూరంలో నీ ధ్యాసలో నేను..
ఏవో పొగమబ్బుల మాటున మసక నీడలో
కొన్ని ఊహల కిలకిలలు
నాకు నేనే దూదిపింజెలా మారి నీతో ఎగిరినట్టు
హృదయం బరువు తేలికై రెక్కలు విచ్చినట్టు
చివురులందించుకున్న పెదవులు తడిచినట్టు
ముచ్చటైన గుసగుసలతో ముద్దులు పంచినట్టు
ఆ చిటారు కొమ్మన కలిసి ప్రేమించుకున్నట్టు
రంగురంగుల దీపాలన్నీ కళ్ళలో వెలిగినట్టు
ఇక్కడంతా నునులేత కాంతి
అప్పుడే తలుపు తెరిచినట్టు మెలకువొచ్చేస్తుంది
తెరలు తెరలుగా నీ తలుపులు
సమూహంలో మౌనాన్ని ఆవహించమని ఉసిగొలుపుతూ..💕

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *