కలలు తీరని రాతిరి నిశ్శబ్దం
శివరంజనిగా మొదలై
స్వరం తప్పిన మౌనంలా శూన్యాన్ని తలపిస్తున్నప్పుడు
నిస్తేజంగా మారిన చూపుల భావం
ఎంత చదివినా అర్ధంకానట్టు
ఏ పదమూ మనసుకి పట్టదు..
మనుషులు దగ్గరయ్యాక మాటలు దూరమై
దిగులు రంగులుగా మారడం
కంటికొసల్లో తడిగా మిగలడం
ప్రతి ఒక్కరి అనుభవాల్లోని మలుపేనేమో..
మురిపిస్తుందనుకున్న కాలం
నిరంతరానికి ప్రవహించే గమనమే అయినా
గుండెలోని తడి ఆవిర్లు బైటకి ఎగజిమ్ముతుంటే
వానెందుకు గుర్తొస్తుందో మరి
సంద్రం ఆపలేని అలలా విషాదం తీరాన్ని దాటుతుందేమో ఈ రాతిరి..

No comments:
Post a Comment