ఒక్క మదిలో ఎన్ని ఆశలో ఎన్ని అందాలో..
ఆ నిశ్శబ్దంలోనూ ఎన్ని సన్నాయిలో
నీతో శృతిలో పడ్డ జీవితానికి
కొత్త పూల పరిమళం పరిచయించేదేముంది
ప్రతికలా మరో పుట్టుకైనట్టు..
ఎంత అనుభూతించినా తనివి తీరనట్టు
ఈ జన్మకైనా నిన్ను పొందాలనే పరితాపం
వేరే ప్రపంచమెందుకులేననిపిస్తుంద
కలగలుపుకున్న ఆత్మ రంగుల్లో
అలలై ఎగిసిపడే నీ జ్ఞాపకాలు
నీటి బుడగల్లా పేలి మాయమవుతున్నా
సాధన చేసి ఆపుకున్న కన్నీటి చుక్కలై
ప్రేమనే పరావర్తనం చేస్తున్నాయి
నువ్వూ నేనూ వేరన్నది వట్టి మాట
తీసే ఊపిరికి తెలుసు ఒకరిలో ఒకరైన పాట..

No comments:
Post a Comment