నులివెచ్చగా మారిన దేహం
ఈ సాయం గాలి
చిలిపిదనానికే కాబోలు
ఆశ నిరాశల రహస్యం
సద్దుమణిగిన చీకటికి తెలిసినప్పుడు
వరదగుడికైన ఎదురుచూపు
హృదయంలోనే నిదురపోవాలి
రేపటికి మనం కలిసుంటామనే ఊహ
పెదవి చివరి సంతోషాన్ని ఆపలేనప్పుడు
ఆకాశమైన అంతరాత్మ
ఆగకుండా సంగీతాన్ని ఆలపిస్తుంది
ఆహా..
ఇప్పటికి విశ్రాంతి దొరికింది
నీ కలలో అలనై ఎగిసానని మురిపెమిప్పుడు..

No comments:
Post a Comment