జూకామల్లె ఊగినట్టు గుసగుసలు
శృతి మించిన గొంతులో పలికెను గమకాలు
సిగ్గుపూల సువాసనైనట్తు విరహాలు
తనువు వేడెక్కి గ్రీష్మాన్ని తిట్టుకున్న దూరాలు
వినీలాకాశంలో మెరుస్తున్న తారకలు
అరమోడ్పు చూపుల్లో కదులుతున్న భావాలు
చిరుగాలి సవ్వళ్ళూ..చిగురిస్తున్న ఊహలూ
తడవతడవకూ పెరుగుతున్న దాహాలు
వైశాఖమా..నువ్వింత సౌందర్యమా..

No comments:
Post a Comment